మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 6వ తరగతి, ఇంటర్మీడియట్ (ఎంపీసీ) సీట్ల భర్తీకి ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె భవాని తెలిపారు .ఆరవ తరగతిలో 40 సీట్లు, ఎంపీసీ ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు, అర్హత కలిగిన బాలికలు ధరఖాస్తులను ఏప్రిల్ 1, 2026 లోగా డుంబ్రిగూడ కేజీబీవీ ఆఫీసులో సమర్పించాలి.అనాధలు, తల్లి లేదా తండ్రి లేని విద్యార్థినులు, నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ల భర్తీ జరుగుతుందని ప్రిన్సిపాల్ వివరించారు.
గమనిక: రాష్ట్రవ్యాప్తంగా ఏపీ కేజీబీవీ అడ్మిషన్లు మార్చి 12 నుంచి ఆన్లైన్లో ప్రారంభమై,ఏప్రిల్ 1 వరకు కొనసాగుతుందని, కేజీబీవీ ప్రిన్సిపాల్ తెలిపారు. వెబ్సైట్ కస్తూరిబా గాంధీ ఏపీ సి యాప్ యాప్ ఎస్ ఎస్ ఐ ఎన్ ఆఫ్లైన్లో ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
