అంబటి వ్యాఖ్యలు క్షమించరానివి,అంబటి రాంబాబు వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీరియస్ గా వ్యవహరించాలి,నిప్పులు చెరిగిన రాష్ట్ర న్యాయ మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై దుర్మార్గపు, అసభ్య పదజాలంతో బహిరంగంగా మాట్లాడిన అంబటి రాంబాబు ఆంబోతు లాగా వ్యవహరిస్తున్నాడని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు క్షమించరానివని మంత్రి ఫరూక్ నిప్పులు చెరిగారు. శనివారం నంద్యాలలో మంత్రి ఫరూక్ మాట్లాడారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవమేనంటూ సిట్ నివేదిక స్పష్టం చేయడంతో వైసిపి నాయకుల్లో వణుకు ప్రారంభమైందని ద్వజమెత్తారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే దౌర్జన్యంగా వాటిని తీసి వేయడానికి వచ్చిన రాంబాబు , స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలపై బూతులతో మాట్లాడడం దారుణమని అన్నారు. చంద్రబాబు కుటుంబంపై అసభ్య పదజాలం, దుర్మార్గపు మాటలతో అంబటి రాంబాబు మాట్లాడి సంఘవిద్రోహ శక్తిగా తయారయ్యాడని మంత్రి ఫరూక్ విరుచుకుపడ్డారు. మంత్రిగా పని చేసిన వ్యక్తి బహిరంగంగా ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని పక్కన పెట్టి చంద్రబాబు కుటుంబం గురించి దారుణంగా మాట్లాడడం నీచాతి నీచమని మంత్రి అన్నారు. వైసీపీ నాయకులకు చట్టసభల్లో కూడా ఇలాగే బూతులతో మాట్లాడటం వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. మంత్రిగా, శాసనమండలి చైర్మన్ గా, ఎంతో సీనియర్ గా ఉన్న తనపై కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో శాసనమండలిలో జోగి రమేష్ ఇదేవిధంగా మాట్లాడిన విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. జోగి రమేష్ మాట్లాడిన అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ పదాలను తీసివేయాలని అప్పట్లోనే శాసనమండలి ప్రివిలైజ్ కమిటీని తాను కోరినప్పటికీ రికార్డుల నుంచి తీసివేయలేదని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికి కూడా అప్పట్లో తనపై జోగి రమేష్ చేసిన అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ పదాలు శాసనమండలి రికార్డుల్లో ఉన్నాయని మంత్రి ఫరూక్ అన్నారు.రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు గురించి అంబటి రాంబాబు ఆంబోతు లాగా మాట్లాడడంపై రాష్ట్ర ప్రజలందరూ వైసిపి తోపాటు, ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును చూసి అసహ్యించుకుంటున్నారని మంత్రి ఫరూక్ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు పై తక్షణమే కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు, జైలుకు పంపాలని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. .వైసిపి నాయకులు దుర్మార్గంగా అసభ్యంగా, మాట్లాడుతుంటే ఆ పార్టీ నాయకుడు జగన్ నవ్వుతూ ఆనందపడుతుంటాడని మంత్రి ఫరూక్ ఎద్దేవా చేశారు. తక్షణమే అంబటి రాంబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.*
ఆంబోతులా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు
RELATED ARTICLES
