Wednesday, February 11, 2026
HomePoliticsAndhra Pradeshఫిబ్రవరి 15లోగా రహదారి పనులన్నీ పూర్తి

ఫిబ్రవరి 15లోగా రహదారి పనులన్నీ పూర్తి

జ్ఞానాపురం-నేవీ హెడ్‌క్వార్టర్స్ రోడ్డును పరిశీలించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఐ.ఎఫ్.ఆర్.2026, మిలాన్ అంతర్జాతీయ నౌకాదళ కార్యక్రమాల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జ్ఞానాపురం నుంచి నేవీ హెడ్‌క్వార్టర్స్ వరకు కొనసాగుతున్న రహదారి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారులు, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్లకు ఫిబ్రవరి 15 లోగా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ కార్యక్రమాలకు దేశ విదేశాల నుంచి ఉన్నతాధికారులు, అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో నగర ప్రతిష్ఠకు భంగం కలగకుండా రహదారి పనుల్లో నాణ్యత, వేగం కీలకమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం ఏ మాత్రం సహించబోమని అధికారులను హెచ్చరించారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments