మండలం లోని కివర్ల పంచాయతీ పూతి కాపుట్టు గ్రామంలో, ఉపాధిహామీ పథకంలో భాగంగా 2024-2025 సంవత్సరములో ఆర్ధిక నిధులు చేపట్టిన పనుల నిమిత్తం శనివారం సామజిక తనిఖీ బృందం వారు ఉపాధి కూలీల, జాబకార్డ్, వేతనాల చెల్లింపులు, గూర్చి కూలిలతో మాట్లాడి అడిగి తెలుసుకొనగా కూలీలు మాకు ఎటువంటి వేతనాల సమస్యలు లేవన్నారు.పనిప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో, వీఆర్పీ జె రాజేష్, వి ఎస్ ఏ పవన్ కుమార్,ఎన్.ఆర్.జి.ఎస్ కిల్డ్ అసిస్టెంట్ ఎస్ దేముడు, ఎస్ ఈశ్వరమ్మ, గ్రామస్తులు .పి సత్యారావు, వెంకట్రావు, పి కొండబాబు, ఎం కొండబాబు, తదితరులు పాల్గొన్నారు.
