Saturday, April 25, 2026
HomeDevotionalశ్రీ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని సందర్శించిన రాధా మనోహర్ దాస్

శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని సందర్శించిన రాధా మనోహర్ దాస్

దేవాలయ నిర్మాణానికి ఆర్ధిక సాయం చేస్తే పుణ్య ఫలం  అనకాపల్లిలో శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న శ్రీ మంత్రి దండిది సహిత శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని ఆదివారం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కృష్ణ చైతన్య బోధకుడు రాధా మనోహర్ దాస్ సందర్శించారు. ముందుగా బాలలయంలో అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెంట ట్రస్ట్ చైర్మన్ పసరకొండ కిరణ్ శర్మ,
సభ్యులు నందన శర్మ, చిట్టిబోయిన కోటేశ్వరరావు, ఆడారి హేమ, ఏ వి ఎస్ త్రినాథ్ లతో స్థలదాత భవ్య శ్రీ డెవలపర్స్ చైర్మన్ కాండ్రేగుల నాయుడు, అనకాపల్లి హరే కృష్ణ అర్చకులు దుర్లభ కృష్ణ ప్రేమదాసు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాధా మనోహర్ దాస్ మాటాడుతూ
దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ, భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ దివ్యమైన దేవాలయ నిర్మాణానికి భక్తులందరూ తమ శక్తి మేరకు వస్తు రూపేణా, ధన రూపేణా సహకరించి పుణ్యఫలాన్ని పొందాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments