Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshగంటన్నరలోనే మిస్సింగ్ బాలికను గుర్తించిన 3 టౌన్ పోలీసులు

గంటన్నరలోనే మిస్సింగ్ బాలికను గుర్తించిన 3 టౌన్ పోలీసులు

రాజమహేంద్రవరం త్రీ టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన 14 ఏళ్ల బాలికను గంటన్నర వ్యవధిలోనే పోలీసులు సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. Cr.No.41/2026 మేరకు కోరిపల్లి సిరివెన్నెల (14), తండ్రి శ్రీనివాసరావు, తల్లి శ్వేతాదేవి, ఆర్.వి. నగర్, రాజమహేంద్రవరం నివాసిగా గుర్తించారు. ఆమె సువిశేషపురం ప్రతిభ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.
ఈనెల 22సాయంత్రం ఇంట్లో మందలించడంతో ఈ నెల 23 ఉదయం 5:00 నుంచి 5:30 గంటల మధ్యలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే బాలిక తాత కాటమరెడ్డి కళ్యాణ చక్రవర్తి డయల్ 112కు సమాచారం ఇవ్వగా, ఇన్స్పెక్టర్ వి. అప్పారావు, ఎస్సై ఎం.వి. రేవతి, కానిస్టేబుళ్లు విజయ్ కుమార్, టి. శ్రీనివాసరావులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా తొర్రేడు వద్ద బాలికను గుర్తించారు. అధికంగా ఫోన్ వాడడంపై ఇంట్లో మందలించడంతో మనస్తాపం చెంది వెళ్లిపోయినట్లు బాలిక తెలిపింది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో బాలికకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి బాలికను సురక్షితంగా కుటుంబానికి అప్పగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments