Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshమత్స్యకార వృద్ధురాలికి వాసుపల్లి ఆర్థిక సహాయం

మత్స్యకార వృద్ధురాలికి వాసుపల్లి ఆర్థిక సహాయం

వృద్ధాప్యంతో బాధపడుతున్న మత్స్యకార మహిళలకు విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు. ఆమెకు పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
38వ వార్డు వన్ టౌన్ ప్రాంతం సోల్జర్ పేట లో ఉంటున్న వాడ బలిజ కమ్యూనిటీ చెందిన చేపల రాజు తల్లి చేపల నాగమ్మ కొద్దిరోజులుగా వృద్ధాప్య సమస్యతో బాధపడుతుంది.విషయం తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ ఆమె ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు.వైద్య ఖర్చుల నిమిత్తం ₹10,000/- ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైయస్సార్ పార్టీకి కార్యకర్తలే బలమని చెప్పారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తుంచుకొని, వారికి అండగా నిలబడుతుందని పేర్కొన్నారు.
అన్ని విధాలగా వారికి అండదండలు అందజేస్తుందని తెలియజేశారు.
దీర్ఘకాలికంగా బాధపడుతున్న చేపల నాగమ్మ వైద్యం కోసం తాను పూర్తిగా సహకరిస్తానని వాసుపల్లి చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments