రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం రామ్ నగర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు సి హెచ్ పట్టాభిరామ్, వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ జన్మ దిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. ఎం వి ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్త దాన శిబిరానికి విశేష స్పందన కనిపించింది. ఈ రక్త దాన శిబిరాన్ని ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గణబాబు , తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు , మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు , వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ , టీడీపీ జిల్లా అధ్యక్షుడు సి హెచ్ పట్టాభిరామ్
టీడీపీ సీనియర్ నాయకులు కోరాడ రాజబాబు, లోడగల కృష్ణ, ఎస్ ఎ రెహ్మాన్ లు ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సి హెచ్ గోపి, బుడుమురి గోవింద్, పోతన్న రెడ్డి, ముత్యాల నాయుడు, అక్కిరెడ్డి జగదీష్, బర్ల బాలకృష్ణ, తాతాజీ, నక్కా కనకరాజు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు ఈతలపాక సుజాత, సంతోష్ కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం వి ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో నిర్వహించిన రక్త దాన శిబిరం లో పెద్ద ఎత్తున యువత, టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు , కార్యకర్తలు పాల్గొని రక్త దానం చేశారు. ఈ శిబిరంలో 300 యూనిట్ల రక్తం సేకరించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు సి హెచ్ పట్టాభిరామ్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉచిత వైద్య సేవలు పొందారు….
టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు
RELATED ARTICLES
