దేవరాపల్లి, జయజయహే : కూటమి ప్రభుత్వం పేదలు అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తుందని సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ అన్నారు. మూంథా తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు ఇంటికి పరిమితం అవడంతో రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిత్యవసర సరుకులను శనివారం సర్పంచ్ పెంటమ్మతో పాటు ఎంపీటీసీ మొల్లి కృష్ణమూర్తి, ఎంపీపీ స్కూల్ కమిటీ చైర్మన్ వంజంగి సూర్యనారాయణ చేతుల మీదుగా మత్స్యకార కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో బి. నాగేశ్వరరావు, శిరం వసంత, సబ్బవరపు మాలి బాబు, పసుమర్తి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
RELATED ARTICLES
