గోకవరం మండలంకామరాజుపేట హై స్కూల్ నందు 7 వ తరగతి చదువుతున్న బాలికను కొత్తపల్లి గ్రామానికి చెందిన కాళ్ళ రాకేశ్ రాకీ అనువాడు బాలిక స్కూల్ వెళ్ళు క్రమంలో ఆమెను ఆపి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న బాలిక తల్లి ఫిర్యాదు పై పోక్సో కేసు నమోదు చేసి, సదరు రాకేశ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం 1వ అడిషనల్ జుడీషియల్ ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్ వారివద్ద హాజరుపరిచినట్లు గోకవరం ఎస్సై వి.ఎన్.వి.పవన్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు, మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎలాంటి వేధింపులు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
స్కూల్ బాలికను వేధించిన కేసులో యువకుడు అరెస్ట్
RELATED ARTICLES
