జె.డి.వరలక్ష్మికి మహిళా కీర్తిరత్న జాతీయపురస్కారం
గోకవరం మండలానికి చెందిన ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు జె.డి. వరలక్ష్మి మహిళా కీర్తిరత్న జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా, శ్రీ శ్రీ కళా వేదిక సంయుక్తంగా నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె సాహిత్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఆమె కనబరిచిన ఉత్తమ ప్రతిభ, నిబద్ధత సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి తెలిపారు. జె.డి.వరలక్ష్మికి మార్చి మూడవ తేదీన విజయవాడలో ఈ అవార్డు ప్రధానోత్సవం జరగనుంది
