Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshనాడు పోరాటం.. నేడు ఆరాటం..!

నాడు పోరాటం.. నేడు ఆరాటం..!

అప్పట్లో రైవాడ నీటి కోసం పోరాటం

ఇప్పుడు మంత్రి పదవి కోసం ఆరాటం

నారా ఫ్యామిలీపై అసెంబ్లీలో కొణతాల భజన

చివరకు దేవాన్ష్ పైనా పొగడ్తలు

అప్పుడు వైఎస్ కు సన్నిహుతుడుగా పాలిటిక్స్

మంత్రి పదవి దక్కించుకుని జిల్లాపై పెత్తనం

రాజకీయ బద్దశత్రువుగా బాబుపై విమర్శలు

ఇప్పుడు అదే చంద్రబాబుపై ప్రశంసలు

సీనియర్ నేత రాజకీయ తీరుపై జోరుగా చర్చ

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ పొలిటీషియన్ పొలిటికల్ స్టైల్ ఛేంజ్ చేసారు. ఒకప్పుడు పోరాటాలు.. ఉద్యమాలు.. అంటూ ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు పంథా మార్చారు.. పొగడ్తలు.. ప్రశంసలతో అడుగులేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు.. రాజకీయ శైలి ఎందుకు మారింది.. ? ఎందుకోసం మార్చి ఉంటారు.. అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పుడున్న రాజకీయనేతలందరి కన్నా ఆయన చాలా సీనియర్. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేసారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరిలానే ఆయనో ఎమ్మెల్యే మాత్రమే..కానీ బ్యాంక్ గ్రౌండ్ చూస్తే అయ్యో.. అంత పెద్ద నాయకుడు ఇలా ఉండిపోయారేంటి అని అంతా నివ్వెరపోతుంటారు. ఆయన మరెవరో కాదు. అనకాపల్లి జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీలో దశాబ్ధాల కాలం పాటు పని చేసారు. అప్పట్లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొణతాల ఓ వెలుగు వెలిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ లో ద్రోణంరాజు సత్యనారాయణతో పాటుగా అనేక మంది సీనియర్లు ఉన్నా సరే వారందరినీ పక్కన పెట్టేసి వైఎస్ క్యాబినెట్ లో మంత్రి పదవిని చేపట్టారు. వైఎస్ కు అత్యంత సన్నిహితులైన వారిలో కొణతాల ఒకరు. నిజానికి కాంగ్రెస్ లో తొలుత వైెఎస్ తో కొణతాలకు అంత సాన్నిహిత్యం లేదు. కానీ అనకాపల్లి జిల్లాలో రైవాడ జైలాశయం నీటి వివాదం విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో కొణతాల కీలక ముందడుగు వేసారు. రైతులకు అండగా నిలుస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేసారు. రైతాంగం పంట కోసం రైవాడ రిజర్వాయిర్ నుంచి జలాలు విడుదుల చేయాలంటూ చేసిన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. దీంతో కొణతాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుడుగా పొలిటికల్ ఎలివేషన్ వచ్చి వైెఎస్సార్ దృష్టిని ఎట్రాక్ట్ చేసారు.

2004లో ఎన్నికల రాగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందితే రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్ లోకి కొణతాలను తీసుకుని వాణిజ్య పన్నుల శాఖ కేటాయించారు. ఇక ఆ టెర్మ్ లో కొణతాల హవాకు ఎదురులేకుండా పోయింది. వైఎస్ కు అత్యంత ఆప్తుడుగా మెలగడంతో సీనియర్లను కాదని కొణతాల చేతిలోనే జిల్లా రాజకీయాలను పెట్టేసారు. జడ్పీ చైర్మన్, వుడా చైర్మన్, నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఏదైనా సరే కొణతాల ఎవరి పేరు చెబితే వారికే వరించేవి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల వరకు కొణతాల హవానే నడిచినా సరే అనూహ్యంగా అనకాపల్లి స్థానంలో 2009లో గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే వైఎస్ ఆకస్మిక మరణం నుంచి 2024లో జరిగిన ఎన్నికల వరకు ఆయన అడ్రస్ లేదు. కేవలం రాజకీయాలు వదిలేసి ఇంటికే పరిమితమైపోయారు. జిల్లా రాజకీయాల్లో సీనియర్ల చేతులు కట్టేసి, ఒంటి చేత్తో రాజకీయాలు నడిపిన రామకృష్ణ దాదాపుగా దశాబ్దానికి పైగా రాజకీయాలకు దూరం కావడంతో ఆంతా ఆయనను మరిచిపోయారు. ఏవో ప్రజా సమస్యల పట్ల చిన్న చిన్న చర్చలు.. రౌండ్ టేబులు లాంటివి నిర్వహించి ఊనికిని చాటుకునే ప్రయత్నం చేసినా సరే ఫలితం లేకుపోయింది.

అయితే ఇటీవల 2024 ఎన్నికల్లో కూటమి ఏర్పాటైన తర్వాత కొణతాాల రామకృష్ణ తన పొలిటికల్ బ్రెయిన్ కు పని చెప్పారు. అత్యంత చాకచక్యంగా చక్రం తిప్పి జనసేన పార్టీ తరుఫున అనకాపల్లి స్థానానికి టికెట్ సంపాదించుకుని గెలుపొందారు. నిజానికి కొణతాల తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీపై పోరాటం చేసి ఎదగడం, తన రాజకీయ గురువు వైఎస్ కు అత్యంత సన్నిహుతుడుగా ఉంటూ ఏర్పాటు చేసుకున్న క్యాడర్ టీడీపీ లో చేరితే దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించి, మధ్యేమార్గంగా పవన్ సారథ్యంలోని జనసేనలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యధిక రాజకీయానుభవం ఉన్న ఎమ్మెల్యే కొణతాలనే. పార్టీ నిర్వహణలోనైనా, ఎలక్షనింగ్ లోనైనా, పాలనా పరంగానైనా కొణతాలకు ఉన్న అనుభవం ఆ పార్టీలో వేరెవరికీ లేనేలేదు. అలాగే జనసేనాని పవన్ కూడా కొణతాల సీనియార్టీని గుర్తించి అనేక కీలకాంశాల్లో బాధ్యతలు అప్పగిస్తూనే ఉంటారు. కానీ ఇటీవల అసెంబ్లీలో కొణతాల చేసిన ప్రసంగం అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కొణతాల రామకృష్ణ అంటే ఏమిటో తెలిసిన వారు ఆ ప్రసంగం చూసి ఔరా.. అని నోరు వెళ్లబెట్టాల్సి వచ్చిందట.

ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కొణతాల రామకృష్ణ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానకిి గురి చేసింది. ఆయన తన స్థానం నుంచే లేస్తూనే తన పంథాకు విరుద్దంగా మాట్లాడటమే ఇందుకు కారణం. కొణతాల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పాయింట్ టు పాయింట్ విమర్శలు చేయడం తప్పితే ఎవరినీ పొగిడినది లేదు. కానీ అనూహ్యంగా ఆయన మైక్ ఆన్ చేస్తూనే పొగడ్తల పల్లవి అందుకున్నారు. అదికూడా మరెవరిమీదో కాదు… నారా వారి ఫ్యామిలీ మీద. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, ఇచ్చేలా కేంద్రంతో ప్రయత్నం చేయాలని సూచించిన కొణతాల ఆ తర్వాత, నారా ఫ్యామిలి మెంబర్స్ ను ప్రశంసంలతో ముంచెత్తారు. నారా భువనేశ్వరి.. బ్రహ్మణి.. దేవాన్ష్ వరకు పొగుడుతూ.. వారిని అసమాన ప్రతిభా పాటవాలంటూ కొనియాడారు. కరుడు గట్టిన కాంగ్రెస్ నేత గా కేరియర్ బిల్డప్ చేసుకుని వచ్చిన కొణతాల రామకష్ణ తనకు రాజకీయంగా బద్దశత్రువుగా భావించే చంద్రబాబును, ఆయన కుటుంబీకులను రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా పొగుడుతుండటం చూసి అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతలోనే తేరుకుని కొణతాలకు చట్టసభలో ఎన్టీఆర్, చంద్రబాబులతో పరిమితం కాకుండా కుటుంబ సభ్యులందరినీ ప్రశంసించడం వెనుక కారణం ఏమిటా అనే చర్చ సర్వాత్రా మొదలైంది. ఇటీవల కాలంలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అందులో జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొణతాల పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫ్యామిలినీ పొగడటం వెనుక క్యాబినెట్ బెర్త్ ను ఖాయం చేసుకునే ఎత్తుగడను కొణతాల వేసారా అన్నది ఉమ్మడి విశాఖ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో కేబినెట్ లో చోటు కోసం ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ అన్న నాగబాబు రెడీ ఉండగా, కొణతాలకు చోటెక్కడది అనే వాదన కూడా సాగుతోంది. దశాబ్ధానికిపైగా రాజకీయాలకు దూరమై రీసెంట్ పొలిటికల్ గా రీ ఎంట్రీ ఇచ్చిన కొణతాల నియోజకవర్గంలో పనులు చేయించుకోవడం కోసం, తన వైపు అధిష్టానం దృష్టి ఉండేలా చేసుకోవడం కోసం ఈ పొగడ్తల పల్లవిని ఎంచుకున్నారా.. అని మరికొందరు అనుమానిస్తున్నారు.

ఏది ఏమైనా సరే.. రాజకీయాల్లోే శాస్వత శత్రువులు ఉండరు.. మిత్రులు ఉండరు అనే ట్యాగ్ లైన్ ఉండనే ఉంది. ఒకప్పుడు చంద్రబాబును బద్దశత్రువుగా భావించే కొణతాల, ఇప్పుడు ఆయనకు అత్యంత గ్రేట్ పొలిటికల్ ఫ్యామిలీగా కనిపిచండంలో ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ల్యాంగ్ గ్యాప్ తర్వాత రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కొణతాల కెరియర్ ఈ పొగడ్తల తర్వాతనైనా టాప్ లోకి వెళుతుందా.. లేక సాదాసీదాగానే సాగుతుందా అనేది చూడాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments