పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
– రకరకాల పిండి వంటలు, బాణాసంచా, డప్పుల మోతతో తరలివెళ్లిన భక్తులు
శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి మహాశివరాత్రి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి సారే ఊరేగింపు కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ గార్డెన్స్ వద్ద కొబ్బరికాయ కొట్టి అమ్మవారి సారే ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించారు. అమ్మవారికి స్వీట్లు, పలు రకాల పిండి వంటలు తయారుచేసి ఊరేగింపుగా బారీగా తరలి వెళ్లారు. టపాసులు , బాణాసంచా , డప్పుల మోత తో ఉత్సవాలలో మహిళలు పాల్గొన్నారు. ప్రసాద్ గార్డెన్స్ యూత్ , దుర్గా మాంబా యువజన సంఘం ,స్థానిక కూటమి నేతలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
