తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్న తొట్టంబేడు రెవెన్యూ అధికారులు ,తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు పంచాయతీ బీ.డీ కాలనీ సమీపంలోని చెన్నై రోడ్డు పక్కన మిలిటరీ భూమి కొనుగోలు పేరుతో చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని చెట్లను నాటుతున్నారు.ఈ భూములు విలువ కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అతను మిలిటరీ పేరుతో 5 ఎకరాలు భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమి చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు అన్నింటినీ ఆక్రమించుకొని వాళ్ల కుటుంబీకులు పేర్ల మీద సర్వే నెంబర్లను సబ్ డివిజనల్ గా మార్చి ప్రభుత్వ అసైన్మెంట్ భూములను అడ్డదారిలో పట్టాలు సృష్టించినట్లు తొట్టంబేడు తెలుగుదేశం పార్టీ నాయకులు,స్థానికులు ఈ ఆక్రమణలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.గత వైసిపి పాలనలో తొట్టంబేడు ఇన్చార్జి తాసిల్దారుగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారి ఈ కబ్జాదారుడికి తప్పుడు రికార్డులను సృష్టించి, ఫ్రీహోల్డ్ లో భూములు పెట్టి అప్పనంగా అడ్డదారిలో ఈ భూములకు రికార్డులు సృష్టించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.ఏది ఏమైనా ప్రభుత్వ డీకేటి భూములును చట్ట ప్రకారంగా అమ్మినా, కొన్నా చల్లదనే నిబంధన ఉంది. ప్రభుత్వ భూములను సుమారు 25 ఎకరాల్లో చెట్లను నాటుతున్నారు. ఈ ఆక్రమణల పై రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పనులను ఆపమని కూడా చెప్పారు. అయినప్పటికీ సైతం లెక్కచేయకుండా చెట్లు నాటే కార్యక్రమం చేపడుతున్నారు.ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణలపై ఇప్పటికే గ్రామస్తులు,తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల్లో అత్యవసరంగా మొక్కల నాటడంలో ఆంతర్యం ఏమిటి?
RELATED ARTICLES
