Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshవెంకట రమణా...గోవిందా....!

వెంకట రమణా…గోవిందా….!

కేజీహెచ్‌ను ఉద్దరిస్తారా…ఊదేస్తారా…!

– ఏంటీ…నన్నేమాత్రం పట్టించుకోవడం లేదు…కొంచెం నన్ను కూడా చూస్తుండు…!
– ఏం కూరలు ఏంటీ…నాకేం తెచ్చావ్…స్పెషల్ తేవాలిగా…!
– సీట్లో లేవ్…ఎక్కడికిపోయావ్ ఏంటీ…ఇలా అర్ధం పర్ధం లేని మాటలతో ఓ ఉన్నతాధికారి తన కింది మహిళా సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉద్యోగుల బాగోగులతో పాటు సంస్థ ఉన్నతికి పాటు పడాల్సిన ఆయన ఆస్పత్రి సామ్రాజ్యానికి తానే బాస్‌నంటూ…త్వరలోనే మరో పెద్ద మెట్టు ఎక్కబోతున్నానంటూ ప్రచారం చేసుకుంటూ ఉద్యోగులను భయకంపితులను చేస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.
ఇదంతా ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా పేర్గాంచిన కేజీహెచ్‌లోని ఓ ఉన్నతాధికారి చిలిపి చేష్టలు…కనీ కనిపించని బూతుల బాగోతమిది. ఎవరికీ అర్ధం కాని రీతిలో ‘నన్నూ కొంచెం చూస్తుండు’ అంటే దాని అర్ధం ఏంటో..ఎలా అర్ధం చేసుకోవాలో కూడా తెలీక ఉద్యోగులు తికమక పడుతున్నారంటే ఆయన మాటలు ఎంత లాజిక్కుగా లాగుతుంటాయో వేరేగా చెప్పాల్సిన పని లేదనుకుంటా..! డబ్బులు అడుగుతున్నారా…కానుకలు తెమ్మంటున్నారా…నిజంగా కూరలే కావాలో తెలీక అక్కడి మహిళా ఉద్యోగులు తికమక పడుతున్నారు. ఇంకొందరైతే…ఆయన ఏమంటున్నారో అర్దం చేసుకోలేని పరిస్థితిల్లో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారంటే…అక్కడి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఆయన పేరు ఏడు కొండల వారి నామధేయం. మాటలు పెడార్దాలు.. ద్వందార్దాలు…చేతలు మాత్రం…ఏదో చేసేస్తున్నానన్నట్టు పైకి బిల్డప్… లోలోన మాత్రం లంచాల బేరం…అవి ఇవ్వకపోయిన ఉద్యోగులను సీట్లు మార్చేయడమే ఆయన పని. అలాంటి వారిని కదిపితే…ఆయన అవినీతి రాజ్యం మొత్తం కదిలిపోద్ది. ప్రస్తుతం ఆయనంటే భయంతో కేజీహెచ్ ఉద్యోగులు వణికిపోతున్నారు. అందరి నోళ్లకు తాళాలేసి ఆ తాళాలన్నీ తన జేబులోనే ఉన్నాయనుకుంటున్న ఆయనకు త్వరలోనే షాక్ తగిలేలా ఉద్యోగులు శాపనార్దాలు పెడుతున్నారు. పైకి మంచోడే…కానీ లోలోన చేసే కుట్రలు మాత్రం రోజుకో గండంలా ఉంటున్నాయని మదన పడుతున్నారు. నిజంగా ఆయన కేజీహెచ్ పరువు కాపాడుతుంటే…నిత్యం వార్తల్లో కేజీహెచ్ ఒక్కటే ఎందుకుంటుంది. విశాఖ మహా నగరంలో ఆదొక్కటే ప్రభుత్వ ఆస్పత్రి కాదుగా…ఆర్సీడీ…ఘోషా…ఆరఈహెచ్…టీబీ…ఈఎన్‌టీ…మెంటల్‌కేర్…విమ్స్ …ఇలా చెప్పుకుంటూ పోతే వాటన్నింటిలోనూ ఎక్కడా కేజీహెచ్‌లో పరువు పోయే పనులు జరుగడం లేదు. కానీ కేజీహెచ్ పరువు బజారున పడకుండా ఓ రక్షణ కవచంలా నిలబడతానంటూ ఊదరగొడుతున్న ఆయన మాటలకు చేతలకు పొంతనేమైనా ఉందంటారా…కేజీహెచ్ సూపరింటెండెంట్‌ను కాదని…అధికారాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న ఆ అధికారి భాగోతం ఎవరిని కదిపినా ఇట్టే చెప్పేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments