Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshగీతం భూములను వెనక్కి తీసుకోవాల్సిందే...!

గీతం భూములను వెనక్కి తీసుకోవాల్సిందే…!

కలెక్టరేట్ ను ముట్టడించిన వైసీపీ
– క్యాడర్ తో భారీగా భైఠాయింపు
– పోలీసుల జోక్యం

రూ. 5 వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసిన గీతం యూనివర్సిటీ భూములను వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్ ను కలసి వినతి పత్రం అందించారు. అంతకు ముందు కలెక్టరేట్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున హాజరైన నేతలతో భైఠాయించారు. ప్రభుత్వం, గీతం యూనివర్సిటీలకు వ్యతిరేకంగా నినాదాలు హారేట్టించారు హోరేట్టించారు. గీతం ఇటీవల దొడ్డి దారిన జీవీఎంసీలో గీతం యూనివర్సిటీకి భూములు క్రమబద్ధీకరణకు అంగీకారం జరిగింది. గీతం యూనివర్సిటీ భూములపై కోర్టులో కేసు ఉండగానే అక్రమ నిర్మాణాల పనులు చేపట్టడంతో ప్రజలు ఆగ్రహించి గీతం యూనివర్సిటీ భూములను వెనక్కి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు.వైసీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజు ఆధ్వర్యంలో జరిగిన
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ ,తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments