అల్లూరి జిల్లా ఐటీడీఏ పరిధిలో గల ఆదిమ జాతి గిరిజనులకు 90% సబ్సిడీ ట్రై కార్ రుణాలు మంజూరు చేయాలని. ఈ సందర్భంగా పివిటిజి సంఘం నాయకులు స్వామి రామచందర్ డిమాండ్ చేశారు. గతంలో ప్రాజెక్టు అధికారి వారి ఆధ్వర్యంలో 90% సబ్సిడీ రుణాలు వచ్చాయని ప్రస్తుతం కనీసం గిరిజనులు ప్రస్తావనకుడ లేకపోవడంతో బాధాకరమని. గతంలో గిరిజనులకు కేటాయించిన రుణాలు వేరే వాళ్లకు ఇచ్చి పేరుకు మాత్రమే ఇచ్చినట్లు చూపించే వాళ్లని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ జాతి గిరిజనుల అభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయిస్తున్న అందని ద్రాక్షల మారిందని వాటి అమలులోకి కొంత జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి 90% రుణాలు పివిటిజి గ్రామాలలో అభివృద్ధి పనులు పీఎం జన్మన్ నిధులు సక్రమంగా అందేలా చూడాలని కోరారు.
