అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ లో నిర్వహించిన ముగ్గుల పోటిలలో గెలుపొందిన విజేతలకు చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ బహుమతులు అందజేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరంతరం కుటుంబ బాధ్యతలతో, విధులు నిర్వహణలో నిమగ్నమైన మహిళా ఉద్యోగులకు ఆటవిడుపు కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వారు రెట్టించిన ఉత్సాహంతో విధి నిర్వహణ పట్ల మరింత అంకిత భావంతో పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, పరిపాలనాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
