గోకవరం గ్రామ దేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవముల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.కూటమి ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబడిన ఈ కమిటీ మొదట సంవత్సర ఉత్సవాలను ఘనంగా నిర్వహించి గ్రామ ప్రజల మన్నలను పొందారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమైనారు.చైర్మన్ ఆచంట రాజు ఆధ్వర్యంలో గుబ్బాలమ్మ ఆలయ కమిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతున్నారు.ఇందులో భాగంగా సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ ఆచంట రాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈనెల 18 నుండి 23వ తేదీ వరకు గ్రామదేవత గుబ్బాలమ్మ జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా జరగనున్నవని,గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఘనంగా ఉత్సవాలను జరుపుతామన్నారు.గరగ నృత్యములతో,గొప్ప బాణాసంచాతో, జానపద,పౌరాణిక నృత్యములతో, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ వెలుగులతో,అకాడమీ ఆటలతో, ఆర్కెస్ట్రా మ్యూజిక్ లతో ఈ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.26వ తారీఖున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గొప్ప అన్నదానం నిర్వహించబడుతుందన్నారు.1972లో గ్రామ దేవత ఉత్సవాలు ప్రారంభమైనవని తొలినాళ్ల నుండి ఇప్పటివరకు దినదినాభివృద్ధి చెందుతూ గోకవరం గుబ్బాలమ్మ జాతరకు భక్తులు విశేషంగా పెరిగారన్నారు.కోరిన కోరికలు తీర్చే దేవత ఈ గుబ్బాలమ్మ అమ్మవారిని,గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు పెరిగే అవకాశముందని,అమ్మవారి దర్శనంనకు వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు.ఈ కార్యక్రమంలో
వైస్ చైర్మన్ ముప్పిడి నాగేశ్వరరావు, వైస్ చైర్మన్
గన్రెడ్డి సన్యాసిరావు,
సెక్రటరీ ముమ్మిడివరపు నారాయణరావు,
కమిటీ మెంబర్ యాళ్ల నాగేశ్వరరావు (శేషు),వెన్ను వీరబాబు,
మామిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ కమిటీ
RELATED ARTICLES
