Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshపున నిర్మాణంతో నూతనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైన నూకాంబిక దేవాలయం

పున నిర్మాణంతో నూతనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైన నూకాంబిక దేవాలయం

స్థానిక గవరపాలెంలో వేంచేసి ఉన్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈనెల మార్చి 8వ తేదీన 10 58 నిమిషాలకు దేవాలయం ప్రారంభోత్సవం మహోత్సవం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించనున్నారని స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. నూకాంబిక దేవాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయం పునర్నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని ముఖ్యంగా గర్భాలయం పనులు పూర్తికావచ్చాయని దేవాలయం చుట్టూరా రాతి పలకలు వేయడం జరుగుతున్నదని దేవాలయం బయట కూడా నూతన కట్టడాలు కూడా నిర్మాణం పూర్తికావచ్చాయని ఈ దేవాలయం నిర్మాణ పనులు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయని ఇప్పుడు మొత్తం పనులన్నీ పూర్తి కావచ్చని ఇంకా ఆలయం బయట నూతన నిర్మాణాలు కూడా క్యూ కాంప్లెక్స్ ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు జరుగుతున్నాయని త్వరలోనే అవన్నీ పూర్తి చేస్తామని , నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండగ గత సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే విధంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర పండగగా ప్రకటించడం జరిగిందని ప్రతి సంవత్సరం అమ్మవారి కొత్త అమావాస్య పండుగ రాష్ట్ర పండగగా కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. ఈ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆహ్వానించడం జరిగిందని ఆయన తెలియజేసారు.ఆలయ ప్రారంభఉత్సవ మహోత్సవం కలశ స్థాపనతో ప్రారంభమవుతుందని ఐదవ తేదీ ఆరవ తేదీ నుంచే వినాయకుడి పూజ, పుణ్యాహవాచనం, కలసస్థాపన పూజ, వాస్తు పూజ,అగ్ని ప్రతిష్టాపన పూజ, అంకురార్పణ జలాధివాసం, హోమాలు తో ప్రారంభమవుతాయని ఈ కార్యక్రమానికి నాలుగు రోజులు అధిక సంఖ్య లో భక్తులు పాలకవర్గ సభ్యులు హాజరై ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని వచ్చిన వారికి తీర్థప్రసాదములు అందించడం జరుగుతుందని. ఈ అమ్మవారి దేవాలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాల కల్పనతో ఈ దేవాలయం పనులు చేయడం జరుగుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పీల నాగ శ్రీను (గొల్ల బాబు) ఆలయ కార్య నిర్వహణ అధికారి వై శ్రీధర్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments