Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshప్రజాలకు సచివాలయ సేవలపై అవగాహన కల్పించాలి.

ప్రజాలకు సచివాలయ సేవలపై అవగాహన కల్పించాలి.

ఆర్డీవో ఎం.వి.ఎస్. లోకేశ్వర రావు

ప్రభుత్వ సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, సేవల నాణ్యత పై ప్రభుత్వం నిర్వహించే IVRS కాల్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని పాడేరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.ఎస్. లోకేశ్వర రావు అధికారులను ఆదేశించారు.

గురువారం డుంబ్రిగూడ అరకువేలి మండల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ. కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ సేవల కోసం సిబ్బంది ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేసినా, లేదా నిర్ణీత సమయంలో సేవలు అందించడంలో విఫలమైనా ప్రజలు తమకు వచ్చే IVRS కాల్‌లో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు సిబ్బంది వివరించాలన్నారు. ఎలక్టర్ మ్యాపింగ్ ప్రక్రియను, ఎలక్షన్ ఫార్మ్స్ డిస్పోసల్‌ను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సేవలపై ఆరా తీస్తూ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో అరకువేలి, డుంబ్రిగూడ మండలాల తహసీల్దారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు ఇతర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments