టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం వి ప్రణవ్ గోపాల్
వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత విద్యార్థి సంఘాలపై ఉందని టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీలో విద్యాపరమైన అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యార్థి సంఘాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే విశ్వవిద్యాలయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని అన్నారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో అనేక విప్లవాత్మక సంస్కరణలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విజయవంతంగా పూర్తయిందని, రానున్న రోజుల్లో మరిన్ని డీఎస్సీ నియామకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యా రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
