Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshప్రేమసదన్ మందిరంలో రక్తదాన శిబిరం

ప్రేమసదన్ మందిరంలో రక్తదాన శిబిరం

శ్రీ సత్య సాయి సేవా సమితి విశాఖ సిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రేమసదన్ మందిరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ మహోన్నత సేవా కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సిటీ సమితి కన్వీనర్ బి. సాయి కుమార్ , రక్తదాన ఇన్‌చార్జ్ కె. వేణుగోపాల్, సిటీ సమితి ఆధ్యాత్మిక సమన్వయకర్త రామరాజు , మహిళా యువత, యువత హాజరై మాటాడుతూ సేవా భావాన్ని పెంపొందించారు.
ఎన్‌టిఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఈ రక్తదాన శిబిరానికి సహకరించి, రక్త సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించింది.
స్వామివారి కృపాకటాక్షంతో మొత్తం 27 యూనిట్ల రక్తం సేకరించారు. కొంతమంది మొదటిసారి రక్తదానం చేయడం ద్వారా సేవా భావానికి నిదర్శనంగా నిలిచారు.
రక్తదానం చేసిన ప్రతి దాతకు అభినందన పత్రాలు అందజేశారు. కృతజ్ఞత సూచకంగా పండ్లరసం, పండ్లు మరియు పెన్లు అందించబడినవి.
కార్యక్రమం మంగళహారతితో ఘనంగా ముగిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments