Home Politics Andhra Pradesh మహిళా ప్రయాణికుల సంఖ్య 65%కి పెరిగింది,

మహిళా ప్రయాణికుల సంఖ్య 65%కి పెరిగింది,

0

47 కోట్ల ఉచిత ప్రయాణాలు

*దివ్యాంగులకు ఉచిత ప్రయాణంపై కీలక నిర్ణయం*

*ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్ల ఆర్థిక సహాయం*

అసెంబ్లీలో మంత్రి మండిపల్లి

స్త్రీ సాధికారత లక్ష్యంగా*
ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు చొరవతో 15-08-2025న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

*స్త్రీలకు ఉచిత ప్రయాణం*
సిటి ఆర్డినరీ, సిటి ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు సహా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నేటి వరకు 47 కోట్ల ప్రయాణాలు జరగగా, రూ.1660 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరించిందన్నారు. ఈ పథకం అమలుతో మహిళా ప్రయాణికుల శాతం 40% నుంచి 65%కు పెరిగిందని, రోజుకు సగటున 25 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.

*దివ్యాంగులకు ఉచిత ప్రయాణం*
దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

*రవాణా శాఖలో అభివృద్ధి కార్యక్రమాలు*
ఆటో డ్రైవర్ సేవలో” పథకం ద్వారా 2025-26లో 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్లు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. డోన్ (కర్నూలు), దర్శి (ప్రకాశం)లలో డ్రైవర్ల శిక్షణ & పరిశోధన సంస్థలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
విశాఖపట్నం గంభీరంలో రూ.16.50 కోట్లతో ఐ అండ్ సి సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

*ఆధునికీకరణ – టెస్టింగ్ మరియు భద్రత*
రాష్ట్రంలో 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు పనిచేస్తుండగా, మారుతి సుజుకి సి ఎస్ ఆర్ కింద మరో 5 ఏర్పాటు కానున్నాయని తెలిపారు. 18 జిల్లాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు పనిచేస్తుండగా, మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.

*విధాన నిర్ణయాలు*
ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 (2024–29) ప్రకారం రాష్ట్రంలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలకు మోటార్ వాహనాల పన్ను మినహాయింపు కల్పించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్డు భద్రతా నిధి ఏర్పాటు చేసి, అమలు ఆదాయాన్ని అందులోకి మళ్లించామని తెలిపారు.

*విద్యార్థులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు*
మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం 75% ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని స్పష్టం చేశారు.

*కొత్త బస్సులు*
పీఎంఈ బస్ సేవ ద్వారా 750 కొత్త బస్సులు రాష్ట్రానికి రానున్నాయని, సీఎన్‌జి, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version