Thursday, June 4, 2026
HomePoliticsAndhra Pradeshఅయినాడ - రేవిడి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన గంటా

అయినాడ – రేవిడి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన గంటా

రూ.3.65 కోట్లతో 11 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేయనున్న అయినాడ – రేవిడి రోడ్డు పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అయినాడ – రేవిడి రోడ్డు వల్ల అయినాడ, బొత్స పేట, బి ఆర్ తాళ్లవలస, కోరాడ, మజ్జిపేట, వెంకటాపురం, రేవిడి తదితర ప్రాంత ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని.. నీళ్ల కుండీలు – రెడ్డిపల్లి రోడ్డు పనులను పూర్తి చేశామని తెలియజేశారు. పాండ్రంగి బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదించామన్నారు.

*రేవిడి పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభం*

రేవిడిలో రూ. 50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ను గంటా ప్రారంభించారు. దీని వల్ల రేవిడి పరిసర ప్రాంత ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపేట వేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పి.జగదీశ్వర రావు, ఇంజనీర్లు జగదీష్, నాయుడు ఎస్. ఈశ్వరి, డాక్టర్ లీలా ప్రసాద్, విజయ్, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, కురుమిన లీలావతి, ఆవాల గంగరాజు, మొకర అప్పలనాయుడు, కాళ్ల సత్యనారాయణ, రామరాజు, మజ్జి నందీష్, పొట్నూరు రాము, వాళ్ల నందిని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments