కోమల్లపూడిలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.శివలింగాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు.మూడు రోజులపాటు ఆలయం వద్ద వేద పండితులతో హోమాదికాలు,పూజలు నిర్వహిస్తారు. తొలిరోజు విఘ్నేశ్వర పూజతో ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.చివరి రోజు శుక్రవారం కోనేరులో శివపార్వతులు, జ్యోతిర్లింగాలు,ధ్వజస్తంభం,సింహద్వారం ఆవిష్కరించనున్నారు.భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు మూడు రోజులపాటు అన్నదానం ఏర్పాటు చేశారు. డైరీ డైరెక్టర్ సత్యనారాయణ మాజీ ఎంపీపీ ఎంవీవి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీలు జి కోటేశ్వరరావు,వియ్యపు అప్పారావు, వడ్డాది టిడిపి నేతలు దొండా గిరిబాబు,సయ్యపురెడ్డి శ్రీనివాసరావు, సింగంపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు
