జీవీఎంసీ 3 వ వార్డులో రూ.93.60 లక్షలతో నిర్మించిన జమ్మి చెరువు ఆధునీకరణ, పాత మున్సిపల్ చౌల్ట్రీ భవనం పునర్నిర్మాణం, ఇండోర్ ఫిట్నెస్ జిమ్ పునరుద్ధరణ పనులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. అలాగే 1, 3 వార్డుల్లో ప్రతిపాదించిన రూ. 1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక భీమిలి జోన్ లోని 4 వార్డుల్లో రూ. 50 కోట్ల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత భీమిలి శరవేగంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తగరపువలస, భీమిలి మెయిన్ రోడ్డు, బీచ్ రోడ్డు విస్తరణ తొందర్లోనే చేపడతామని తెలిపారు. చారిత్రకమైన భీమిలి గంట స్తంభం అభివృద్ధికి జీవీఎంసీ రూ. 50 లక్షలు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఎం.విజయ్ కుమార్, కార్పొరేటర్లు గంటా అప్పలకొండ, గాడు చిన్ని కుమారి లక్ష్మి, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర, కనకల అప్పలనాయుడు, తమ్మిన సూరిబాబు, కొప్పల రమేష్, భువనేశ్వరి, సూరాల సత్య వరప్రసాద్, వై. అనిల్ ప్రసాద్, గాడు యశ్వంత్, జీరు సత్యం, సింగపూర్ బుజ్జిరాజు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభించిన గంటా
RELATED ARTICLES
