Wednesday, June 3, 2026
HomePoliticsAndhra Pradeshపంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలి

పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మించల శివకుమార్ డిమాండ్
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలని వేసవి కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మించిన శివకుమార్ డిమాండ్ చేశారు, రాత్రి పగలు కష్టపడి విష సర్పాల బారిన పడుతూ చెమటోడ్చి పంటలు పెట్టుకుని పెట్టుకున్న పంటను అమ్ముకునే సీజన్ వస్తే మధ్యంతర దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్నారని పంటలు పండించే రైతన్న బాధలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు,అధికారులు మారుతున్న ప్రభుత్వాలు మారుతున్న రైతన్నకు ఆదుకునే అధికారులు ఎవరూ లేరని ఎకరా పంట పెట్టాలంటే నకిలీ మందులు వేలల్లో ప్రైవేటు షాపులు పెట్టుకొని కోట్ల రూపాయలు రైతుల వద్ద దోచుకుంటున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు,రైతు ఎకరాకు 50 వేల రూపాయలు వరకు ఖర్చు అవుతున్నదని దళారులు కొనేటప్పుడు ఎకరా పంట 30000 కూడా ఆటగడం లేదని మండిపడ్డారు, ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళారుల నుంచి ప్రభుత్వమే రైతులు పండించే పంటను కొనుగోలు చేసుకుని వారికి సరైన గిట్టుబాటు కల్పించాలని అన్నారు,ఈ కార్యక్రమంలో మైలేరీ రంగయ్య పొట్టియ్య బాబు చిన్నస్వామి రైతు నారయ్య రమేష్ పెంచలయ్య వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments