తొట్టంబేడు మండలం గుండెలుగుంట పంచాయతీ కొత్త కండిగ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి,కొత్త కండ్రిగ గ్రామానికి చెందిన ఎస్ రాజా, అమరావతికి 22 సంవత్సరాల క్రితం వివాహమైంది ,అమరావతికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె, కుమారుడు విశాల్ ఇంటర్, ప్రేమ్ కుమార్ ఏడో వ తరగతి, కుమార్తె పదవ తరగతి చదువుతున్నారు, కుటుంబ కలహాలు కారణంగా అమరావతి సోమవారం పురుగులు మందు తాగింది.బంధువుల సహాయంతో శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో కావడంతో తిరుపతిలోని రుయా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
