Tuesday, May 26, 2026
HomePoliticsAndhra Pradeshవైసీపీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలి*

వైసీపీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలి*

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రాష్ట్రంలో వైసీపీ నాయకులు రౌడీల్లా, అంబోతుల్లా పెట్రేగి పోతున్నారని, వారికి తల్లులున్నా, చెల్లెలన్నా, మహిళలన్నా గౌరవం లేదని, తక్షణమే ఆ పార్టీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కోరారు. సీఎం చంద్రబాబు మాతృమూర్తిని అంబటి రాంబాబు దూషించడం క్షమించరాని నేరమన్నారు. తక్షణమే ఆయన్ను అరెస్టు చేయాలన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ నాయకులు రౌడీల్లా చెలరేగిపోతున్నారని, అయితే రప్పా… రప్పా… అంటూ నరుకుతామంటున్నారని, లేకుంటే ఆడవాళ్లను బండ బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. గడిచిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా, అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా వైసీపీ గూండాల గుణం మారడం లేదన్నారు. సీఎం చంద్రబాబు మాతృమూర్తిని అంబటి రాంబాబు దూషించడం క్షమించరాని నేరమన్నారు. తక్షణమే అంబటిని అరెస్టు చేయాలని, భవిష్యత్తులో ఇంకెవరైనా స్త్రీల వైపు కన్నెత్తు చూడాలన్నా, దూషించాలన్న భయపడేలా శిక్షించాలని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు సతీమణిని, నేడు తల్లిని దూషించడం బాధాకరమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడిని కొనియాడకపోగా, దూషణలకు దిగడం దారుణమన్నారు. కీచకులను, రౌడీలను, గూండాలను, గంజాయి బ్యాచ్ లను వెంటబెట్టుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తల్లిని, చెల్లిని కూడా గౌరవించిన జగన్, రాష్ట్రంలో ఇతర మహిళలను ఎలా గౌరవిస్తాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని ప్రాంత మహిళలపై జగన్ దాడులకు దిగాడని, ఓడిన తరవాత వారిపై తన నీలిమీడియా తప్పుడు మాటలు ఆడించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్, వైసీపీ నాయకులు రాజకీయాలకు పూర్తిగా అనర్హులని, ప్రజల వారిని రాష్ట్రం తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని వైసీపీని బ్యాన్ చేయాలని మంత్రి సవిత కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments