ఏఐటీయూసీ నేత కోన లక్ష్మణ
దారి మళ్ళించిన సంక్షేమ బోర్డు నిధులను తిరిగి బోర్డు ఖాతా లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. మండలం లో ని కరక గ్రామం లో ఆదివారం శ్రీ మరిడీ మాంభ ఆలయం లో జరిగిన భవన కార్మికులు సమావేశం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్ని మాట్లాడుతూ
పెండింగు లో ఉన్న 46 వేల క్లెయిమ్స్ ను వెంటనే కార్మికులకు చెల్లించాలన్నారు.
10 సం॥లు గడిచినందున బోర్డు ద్వారా ఇస్తున్న అన్ని క్లెయిమ్స్ పెరిగిన ధరల దృష్ట్యా రెట్టింపు చేయాలని 55 సం. లు నిండిన ప్రతి నిర్మాణ కార్మికునికి నెలకు రూ.5 వేలుపెన్షన్ ఇవ్వాలి.
ప్రమాదాలకు గురైన వారికి, తీవ్ర వ్యాధులకు గురైన భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వమే బోర్డు ద్వారా వైద్య సహాయం అందించాలి.
భుత్వ, ప్రైవేట్ కట్టడాలపై యజమానుల నుండి వసూలు చేస్తున్న సెస్సు ను చట్టంలో చట్టంలో నిర్దేశించినట్లు 1.% నుండి 2% కు తిరిగి పెంచాలి.పెరిగిన పనిభారం దృష్ట్యా కార్మికశాఖ కార్యాలయాలలో తగిన సిబ్బందిని నియమించాలి. నిర్మాణ కార్మికులకు. ఈ యస్ ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. సమావేశం లో అధ్యక్షులు ఆదాడ శ్రీను, కార్యదర్శి పిల్ల చిన్న వెంకటరావు, వై. పరదేశి, శివ,డి.చిన్ని, డి సత్తిబాబు, వై. ఏ నాయుడు తదితరులు పాల్గొన్నారు
