Home Politics Andhra Pradesh మామిడి సాగుపై వినూత్న ప్రదర్శన

మామిడి సాగుపై వినూత్న ప్రదర్శన

0

బుచ్చయ్యపేట కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల (ఎచ్చెర్ల) మరియు కృషి విజ్ఞాన కేంద్రం (కొండెంపూడి) సంయుక్త ఆధ్వర్యంలో మండలం లో గల భీమవరం గ్రామంలో ఆదివారం మామిడి సాగుపై విద్యార్థులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ పని అనుభవ కార్యక్రమం 2025-26)లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి వారి మార్గదర్శకత్వంలో విద్యార్థులు లంక జ్ఞానేంద్ర, వి. కిరణ్ నాయక్, ఎస్.కె. రహీమ్, మరియు ఇ. మహేష్ నాయక్ ఈ ప్రదర్శనను నిర్వహించారు.

మామిడి సాగులో నాణ్యమైన దిగుబడిని సాధించేందుకు మరియు చీడపీడల నుండి పంటను రక్షించుకునేందుకు “మెథడ్ డెమోన్స్ట్రేషన్ ఆన్ మ్యాంగో బ్యాగింగ్” (మామిడి కాయలకు సంచులు కట్టే విధానం) పై శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమం లో సర్పంచ్ పినపోలు రామునాయుడు రైతులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version