Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshకేంద్రo నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి

కేంద్రo నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి

సామాజిక న్యాయానికి తూట్లు సిపిఎం ఉద్యమాలకు కార్యాచరణలు కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నిరంకుశ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు , జిల్లా కమిటీ ప్రతినిధి నంబూరు షణ్ముఖరావు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం వి బి జి రామ్ జి , విద్యుత్ చట్టాల సవరణ లేబర్ కోడ్స్, సీడ్ బిల్లు, మినీ అను విద్యుత్ కేంద్రాలు, అమలు చేయడం వల్ల కార్పొరేట్ కంపెనీలు లాభాలు సాధిస్తాయని, ప్రజలపై విపరీత భారం పడుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు జనవరి 30న గ్రామాల్లో ప్రతిజ్ఞలు, సంతకాల సేకరణ, ఫిబ్రవరి 2న సచివాలయాలకు వినతి పత్రాలు అందించడం, ఫిబ్రవరి 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని ఉద్యమాలకు కార్యాచరణ లు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త చట్టాలు అమల్లోకి వస్తే ప్రజలు, ప్రజా సామాజిక న్యాయాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు, పేదల కందే సబ్సిడీలు ఉండవని, కార్మికులు సమ్మె హక్కును కోల్పోయీ, హక్కులని నిర్వీర్యమైపోతాయని అన్నారు. వ్యవసాయం నష్టాల్లో పడుతుందని, బిజెపి ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న చట్టాలన్నిటిని సిపిఎం వ్యతిరేకించి ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కె ఎల్లయ్య, యు లక్ష్మణరావు, ఈశ్వర రావు, బ గాది వాసుదేవరావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments