Home Politics Andhra Pradesh బతుకు భారం భవిత ఘోరం వలస బాట లే వరం

బతుకు భారం భవిత ఘోరం వలస బాట లే వరం

0

ప్రపంచంలో ఏడ చూసిన ఉత్తరాంధ్ర వాసులే

బతుకు జీవుడు భయo తో ఊర్లు దాటేశారు

దేశం ప్రగతి పథంలో నడుస్తోంది ఈ సమాజం సాధికారత దిశగా పయనిస్తుంది, పల్లె మారుమూల ప్రాంతాల్లో గాలిప్రాణ సాధనాలైన లైనా విమానాలు, విమానాశ్రయాలు అత్యంత వేగంగా సిద్ధమవుతున్నాయి,

కంప్యూటర్ పరిజ్ఞానంతోఏ ఐ లు దూసుకు వస్తున్నాయి, ప్రపంచంలో ఏ మూల జరిగిన సంఘటనలన్నీ క్షణాల్లో మనిషి ముందుకు వస్తున్నాయి, చేతి సొమ్ములు పోయి డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి, ప్రగతి పురోగమనములో పారిశ్రామిక అభివృద్ధి కి బాటలో వేస్తున్నామన్న పాలకులు, పలు రాజకీయ పార్టీలు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ మారుమూల పల్లె గ్రామాల్లో అర్ధాకలితో బతుకు జీవుడా అంటూ కడుపునిండా తిని ప్రాణాలు నిలబట్టుకునేందుకు తమ కుటుంబాలతో ఊరు, వాడ పోలిమేర్లు దాటి పెద్ద పట్నాలకు వలస బాటలు పట్టడం ఏ ప్రభుత్వాలు వచ్చిన తమ బతుకులు ఇంతేనని ఉత్తరాంధ్రలోని పేదల రోదన తీరే పరిస్థితులు లేవని వలసలే శరణ్యముగా వరంగా భావించి ఇతర ప్రాంతాలకు ఈ ప్రాంత వాసులు వెళ్లి కూలి నాలి చేసుకుని ఏ పండగలకో జాతరలకో కుటుంబాలన్నీ కలుసుకోవడం తమ బాధలన్నీ మరిచిపోవడం పల్లె వాసుల నిత్యజీవనముగా కొనసాగుతూ ఉంది. ప్రపంచ దేశాల్లో ఏ మూలకు వెళ్లిన ఉత్తరాంధ్రవాసులు జాడ కనబడుతుంది.

నేటి పాలకులు చెబుతున్న పారిశ్రామికీకరణ, పరిశ్రమల స్థాపనలో పల్లె వాసుల పాత్ర ఎక్కడ కానరాకపోవడం విశేషం, శ్రీకాకుళం తో పాటు విజయనగరం, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూలి పనులు తప్ప ఎలాంటి అభివృద్ధిలో వీరిని భాగస్వామ్యం చేస్తే పరిస్థితులు కానరావని చెప్పాలి, స్థానిక అభివృద్ధి కోసం మాట్లాడుతున్న అధికారులు నాయకులు, ప్రతి ఊర్లో ఎంతమంది నిరుద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, కూటికోసం కోటి విద్యలు అని తమకు తాము ప్రశంసించుకున్న ప్రజలు ఏ ఒక్క పారిశ్రామికీకరణకు దగ్గరలేరనేది జగమెరిగిన నగ్న సత్యం, ప్రభుత్వాలకు స్థానిక గ్రామాల్లో సేవలందించేందుకు సచివాలయాల్లో తగిన విధంగా సిబ్బంది తదితర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉన్నప్పటికీ స్థానిక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఎలాంటి మార్పులు అభివృద్ధి దిశా దశ జరగడం లేదు అనేది ఉన్నతాధికారులకు తెలిసిన తంతు గానే మిగిలిపోతుంది.

సమాజంలో పేదరికం పాలకుల అలసత్వమా ప్రజా ప్రణాళికల్లో లోపభూయిష్టమా క్షేత్రస్థాయిలో సమాచార లోపం తో కోట్లాది రూపాయల ఖర్చు జరుగుతున్నప్పటికీ పేదరిక నిర్మూలన చేయలేక నేటికీ అర్థం లేని కుల మత పోకడలతో స్వామీజీలు చెప్పిన సందేశాలకు సలాం చేయడం మేధావి వర్గాలకు అంతుచిక్కని సమస్యగా మారుతుంది,

మన ప్రాంతంలో ఉన్న సంపదలు, సిరులు తో స్థానిక అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి మానవ వనరులను వాటి ఇష్టమైన కార్యాచరణతో గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర పరిశోధన , సర్వేలు, పారదర్శకంగా చేపట్టి రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర వలస బాటలను అరికట్టి సమాజ శ్రేయస్సు కోసం అధిష్టాన వర్గాలు పాలకులు సమగ్ర ఆలోచనలు చేయాలని పలువురు ఉత్తరాంధ్ర మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు భావిస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version