1184మంది హాజరు
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి చోడవరం మండలంలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1191 మంది విద్యార్థిని విద్యార్థులకు గాను 1184 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 250 మందికి గాను ఒక విద్యార్థి హాజరు కాలేదు,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 220 మందికి గాను ఒకరు,పి ఎస్ పేట ఉన్నత పాఠశాలలో 212 మందికి గాను ఒకరు,భాష్యం పబ్లిక్ స్కూల్లో 287 మందికి గాను ఒకరు,గోవాడ ఉన్నత పాఠశాలలో 180 మందికి గాను ఇద్దరు,లక్కవరం ఉన్నత పాఠశాలలో 72 మందికి గాను ఒక విద్యార్థి హాజరు కాలేదు.పరిక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు ఆయా పరీక్ష కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమల్లో ఉంది ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంచారు 9-30 నుంచి 12:30 వరకు పరీక్షా సమయం ఉండగా గంట ముందుగానే విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు పరీక్ష కేంద్రాలకు 6 గురు చీఫ్ సూపరింటెండెంట్స 6 గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉండగా ఇన్విజిలేటర్స్ గా 58 మంది ఉపాధ్యాయులను నియమించారు .లక్కవరం కేంద్రం కేంద్రానికి సిట్టింగ్ స్కాడ్ ని ఏర్పాటు చేశారు.
