స్పందించకపోతే ఆందోళన
క్యాస్ట్,లేట్ డేట్ సర్టిఫికెట్ కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసి నేటికీ ఐదు నెలలు అవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని గిరిజనులు మండిపడుతున్నారు. ఈ మేరకు సోమవారం అజయ్ పురం గ్రామంలో నిరసన వ్యక్తం చేసి ధర్నా చేపట్టారు.
వారం రోజుల్లో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళననిర్వహిస్తామనీ హెచ్చరించారు. రావికమతం మండలంలో చీమలపాడు పంచాయతీ అజయ్ పురం గ్రామానికి చెందిన 12 మంది సచివాలయంలో చలానా కట్టి దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. కనీసం మేము చేసిన దరఖాస్తులను తిరిగి ఇవ్వమంటే ఇవ్వడం లేదని మండిపడ్డారు.మా దరఖాస్తులు ఎక్కడున్నాయి. మా దరఖాస్తు తిరిగి మాకు ఇవ్వండి. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేయాలంటే రెండు రోజులు తిరగాలి. తిరితేగాని సచివాలయంలో రిజిస్ట్రేషన్ కాదన్నారు. కష్టపడి రిజిస్ట్రేషన్ చేసి రెవిన్యూ సెక్రెటరీ కి ఇస్తే అతని ఎక్కడ పెడుతుందో తెలియని పరిస్థితి. రెవెన్యూ డివిజన్ అధికారి కొండదొర సర్టిఫికెట్లు ధ్రువీకరించాలి. లేటు డెత్ సర్టిఫికెట్లు కూడా రెవెన్యూ డివిజన్ అధికారి ధృవీకరించాలి. సచివాలయంలో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు ఎక్కడికి పోతున్నాయో తెలీనీ పరిస్థితి నెలకొందన్నారు.
వీటిపై జాయింట్ కలెక్టర్ సమగ్రమైన దర్యాప్ చేసి లేట్ డెత్ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని. లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తాం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు డిమాండ్ చేశారు.
