గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ప్రోత్సాహంతో కేజే పురం గ్రామంలో బిశెట్టి శ్రీనివాసరావు జ్ఞాపకార్థం శంకర్ ఫౌండేషన్, హెచ్ హెచ్ ఎస్ వి ఎన్జీవో, టిడిపి క్లస్టర్ కన్వీనర్ బిశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత
నేత్ర వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 140 మంది నేత్రా రోగులు పరీక్షలు నిర్వహించుకోగా, వారిలో 28 మందిని కంటి శుక్లాల ఆపరేషన్లకు శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రికి తరలించారు.
ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ పుట్టా రాంబాబు, టిడిపి సీనియర్ నాయకులు మండల కమిటీ నెంబర్ పాలకుర్తి శ్రీనివాసు, బీశెట్టి కోట అప్పారావు, ఎల్లప్ప పెంటయ్య, పాలమరశెట్టి చిట్టినాయుడు, యూనిట్ ఇంచార్జ్ మద్దాల ప్రసాద్, కో ఇంచార్జ్ ఆడారి రమేష్, బూత్ కన్వీనర్లు ఎల్లపు రాము, కొట్టాడా రఘు, బొడ్డేటి వెంకట్రావు, పరిమి సోమప్పారావు, కాళ్ల వెంకట్రావు గ్యాస్, కాళ్ళ వెంకట్రావు, ఆడారి సన్యాసిరావు, స్కూల్ కమిటీ చైర్మన్ కర్రీ సంతోష్,జనసేన కోపరేటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ శేఖర్, ఎంపీపీ స్కూల్ చైర్మన్ పద్మ ,కింతలి జనసేన అధ్యక్షులు అశోక్, నీటి సంఘం చైర్మన్ కోయిలాడు సన్యాసిరావు, మల్ల జగ్గారావు, వైస్ చైర్మన్ భీశెట్టి సూరిబాబు, ఎల్లపు బలిబాబు తదితరులు పాల్గొన్నారు.
