Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshవిద్యార్థులకు చట్టాలపై అవగాహనా అవసరం

విద్యార్థులకు చట్టాలపై అవగాహనా అవసరం

కొండయ్య వలస శ్రీ విజ్ఞాన్ టాలెంట్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ కన్జ్యూమర్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య జాయింట్ సెక్రటరీ కొర్రాయి నాగార్జున రావు జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం – 2019 గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఉత్పత్తుల వివరాలు పరిశీలించాలని, మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ చట్టం ప్రకారం వినియోగదారులకు భద్రతా హక్కు, సమాచారం పొందే హక్కు, ఎంపిక హక్కు, పరిహారం పొందే హక్కు వంటి హక్కులు కల్పించబడ్డాయని వివరించారు.
ఏడీసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ కల్తీ ఆహారం పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛమైన మరియు నాణ్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరమని చెప్పారు.
స్కూల్ కరస్పాండెంట్ కె వి సత్యనారాయణ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అగనంపూడి ఏరియా ఆసుపత్రి మాజీ చైర్మన్ కొర్రాయి జగదీష్ శ్రేయ ఫౌండేషన్ మేనేజర్ కెవిపి ప్రసాద మహాత్మా గాంధీ సేవా సంస్థ ఫౌండర చిత్త రామారావు పాల్గొన్నారు. అనంతరం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని గ్టఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments