Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది ఉన్నవ నాగరాజు నియామకం

ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది ఉన్నవ నాగరాజు నియామకం

ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా) ఉపాధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది, ఏపీ హైకోర్టు స్టేండింగ్ కౌన్సిల్ (ఎండోమెంట్స్) ఉన్నవ నాగరాజు నియమితులయ్యారు. న్యాయవాదుల భద్రత, వృత్తి భవిష్యత్ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న “ఆలా” సంస్థలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలా అధ్యక్షులు రాజారామ్ ఎం.వి. ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ ఈ నియామకాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఉన్నవ నాగరాజు మాట్లాడుతూ, న్యాయవాదులందరూ ఐక్యంగా కృషి చేసి వృత్తి భద్రతకు, భవిష్యత్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. వరస సంఖ్య 73కు తొలి ప్రాధాన్యత ఓటును వేసి, అత్యధిక మెజార్టీతో రాజారామ్‌ను గెలిపించాలని ఆయన న్యాయవాదులను కోరారు.
ఆలా ఉపాధ్యక్షులుగా నియమితులైన ఉన్నవ నాగరాజుకు ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments