సేవ్ రాజమండ్రి కాదు… సేవ్ వైసీపీ చేసుకో : టీడీపీ నాయకుల ఘాటు విమర్శలు
నగర అభివృద్ధి అంశాల్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌కు కనీస రాజకీయ అవగాహన కూడా లేదని నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమీ జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. గోరక్షణపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
గోరక్షణపేట రోడ్డుపై భూగర్భ పైపులైన్ పనులు పూర్తయిన తర్వాతే రోడ్డు నిర్మాణం జరుగుతుందని, దీనిపై అవగాహన లేకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు 15 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్ లీకేజీ కారణంగా రూ.3 కోట్లతో పక్కా మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచనలతో 50 ఏళ్ల పాటు నిలిచేలా పనులు జరుగుతున్నాయని చెప్పారు.
దశలవారీగా అభివృద్ధి జరుగుతుంటే పబ్లిసిటీ కోసం “సేవ్ రాజమండ్రి” అంటూ హడావిడి చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో రాజమండ్రి సురక్షితంగా ఉందని, బలం కోల్పోయిన వైసీపీని కాపాడుకునేందుకు భరత్ “సేవ్ వైసీపీ” చేసుకోవాలని హితవు పలికారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజమండ్రిలో టీడీపీ జెండానే ఎగిరుతుందని స్పష్టం చేశారు.
భరత్… ఇంతేనా నీ రాజకీయ అవగాహన?
RELATED ARTICLES
