Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshజాతీయ గ్రామీణ రహదారుల్లో భద్రతలు

జాతీయ గ్రామీణ రహదారుల్లో భద్రతలు

పోలీస్ శక్తి టీమ్ అవగాహన కార్యక్రమాలు

జాతీయ గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల్లో ప్రమాదాలు ఎవరికీ చెప్పి రావని మనమే వ్యక్తిగతంగా మన చుట్టూ జరగబోయే ప్రమాదాలపై భద్రత వహించి అమూల్యమైన ప్రాణాలను రక్షించుకోవాలని టెక్కలి సబ్ డివిజన్ పోలీస్ శక్తి టీమ్ సభ్యులు జాతీయ రహదారులు పక్కన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులు, ప్రజల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి పరశురాంపురం ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బందికి ప్రయాణ భద్రత అంశాలను అవగాహన కల్పించారు. మైనర్లు బైక్లు డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని, రవాణా నిబంధనలను కచ్చితంగా పాటించాలని హితవు పలికారు.

ఏదైనా అనుకోని ప్రమాద సమయంలో జాతీయ రహదారి హెల్ప్ లైన్ 1033, పోలీస్ హెల్ప్ లైన్ నెంబరులు 181,112,1091 లకు తక్షణమే ఆపద , ప్రమాదంలో ఉన్న వ్యక్తులు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసు శక్తి టీం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి హెడ్ కానిస్టేబుల్ ఎం గిరిధర్, కె గణేష్, కె రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments