*శ్రోతులను మైమరిపించిన కవి కువలయ శీతకారుల కవిత పద్యాలు
శ్రీరామరాజ భూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం శ్రీమహిషాసుర మర్ధిని భీమేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టిన ఉగాది కవి సమ్మేళనం అందరినీ ఆలోచింపజేసింది. కవి కువలయ శీతకారుల బ్రహ్మశ్రీ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, రసరాజు, ఇందుకూరి వెంకట లక్ష్మీపతిరాజు, డా జి రామకృష్ణంరాజు, బ్రహ్మశ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గురు సహస్రావధాని, డా కోరుకొండ సుజాత దేవి, చిలకమర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి, సరికొండ నరసింహరాజు లు మధురమైన కవిత్వం తో సాహితీ ప్రియులను అలరించారు. ఆద్యంతమూ వారి కవితలు సదస్యులను కట్టిపడేశాయి. డా ముదునూరి గోపాల కృష్ణంరాజు అధ్యక్షతన విశ్రాంత ఐటి డైరెక్టర్ వెలమకన్ని రాజేంద్ర కుమార్ (హైదరాబాద్), మేళం జగదీశ్వరి, డా వేగేశ్న ప్రవీణ కుమారి, డా భూపతిరాజు ఐశ్వర్య, డా కట్రెడ్డి మౌనికలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు నడింపల్లి వెంకట్రామరాజు, రాయప్రోలు భగవాన్, భట్టిప్రోలు శ్రీనివాసరావు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను, తెలుగు మూలాలను మర్చిపోకుండా ప్రతి ఏడాది వేడుకలను నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తూలతూగాలని అన్నారు. కార్యక్రమంలో సాహిత్య పరిషత్ సభ్యులు మంతెన రామ్ కుమార్ రాజు, బొండా రాంబాబు, నడింపల్లి మహేష్, పేరిచర్ల లక్ష్మణ వర్మ, చుక్కన నాని, సుందరం, స్వామి పాల్గొన్నారు.
