Wednesday, April 22, 2026
HomeUncategorizedరైతు భరోసా డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: అచ్చిబాబు

రైతు భరోసా డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: అచ్చిబాబు

కొవ్వూరు నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రా షుగర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుత రామయ్య (అచ్చిబాబు) హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలకు వివరించారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింతగా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
అలాగే మైటీడీపీ యాప్ వినియోగంపై కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ, రేపటి నుంచి ప్రారంభమయ్యే రైతు భరోసా డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను మైటీడీపీ యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో టుమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, కొవ్వూరు ఛైర్పర్సన్ భావన రత్నకుమారి, ఆళ్ళ హరిబాబు, ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, అనుపిండి చక్రధరరావు, సూరపని చిన్ని, సిద్దా దుర్గాప్రసాద్, బేతిన నారాయణ, నామన పరమేష్, దాయన రామకృష్ణ, కళాధర్ చక్రవర్తి, వేమగిరి వెంకట్రావు, వట్టికూటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇంచార్జిలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments