Monday, April 20, 2026
HomeNewsకడప ఇస్తేమా ఏర్పాట్ల కోసం రూ. 1.25 కోట్లు విడుదల

కడప ఇస్తేమా ఏర్పాట్ల కోసం రూ. 1.25 కోట్లు విడుదల

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వాహనాలకు రాష్ట్ర ప్రవేశ పన్ను మినహాయించాలని రవాణా మంత్రికి వినతి కడపలో మూడు రోజులపాటు జరగనున్న ఇస్తేమా నిర్వహణ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.25 కోట్లు విడుదల చేసింది. కొప్పర్తి పారిశ్రామిక వాడ సమీపంలో ఈనెల 23,24,25 వ తేదీలలో జాతీయస్థాయి తబ్లిగి జమాతే ఇస్తేమా నిర్వహిస్తున్నారు.జాతీయస్థాయిలో జరిగే ఇస్తేమాకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరు కానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణ ఏర్పాట్లపై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరిగింది.రవాణా సౌకర్యం, వసతి, పారిశుద్ధ్య ఏర్పాట్ల కోసం చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన రూ. 1.25 కోట్లు మొత్తాన్ని కడప కలెక్టర్ బ్యాంక్ అకౌంట్ కు జమ చేయడం జరిగిందని మంత్రి ఫరూక్ అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటన లో వెల్లడించారు.జాతీయ స్థాయి ఇస్తేమాకు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇస్తేమా జయప్రదం చేయాలని రాష్ట్ర, దేశ సౌభాగ్యం కోసం, విశ్వ శాంతి కోసం ఇస్తేమాలో ప్రార్థించాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కోరారు. వాహనాలకు రాష్ట్ర ప్రవేశ పన్ను మినహాయింపుకు వినతి
జాతీయస్థాయి తబ్లిగి జమాతే ఇస్తేమా కు వివిధ రాష్ట్రాల నుండి ఇస్లామీ భక్తులు తరలివస్తున్న వాహనాలకు రాష్ట్ర ప్రవేశ పన్ను మినహాయించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డికి మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సోమవారం లేఖ ద్వారా కోరారు.
కడప పారిశ్రామిక వాడ ప్రాంగణంలో ఈ నెల 23, 24,25 తేదీలలో జరగనున్న జాతీయస్థాయి తబ్లిగి జమాతే ఇస్తేమా కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులు తమ రవాణా ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేసుకున్న బస్సులు, ట్రక్కులు, కార్లు తదితర వాహనాలన్నింటికీ రాష్ట్ర ప్రవేశ పన్ను మినహాయించాలని కోరారు.ఈ నెల 20 వ తేది నుండి 27 వ తేది వరకు కడపకు రాకపోకల ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని చెక్ పోస్ట్‌లలో రాష్ట్ర ప్రవేశ పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు.అలాగే భక్తులకు రవాణా మార్గంలో ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సాఫీగా ప్రయాణం జరిగేలా చూడాలని రవాణా మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి దృష్టికి మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీసుకువెళ్లారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments