ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేత
రోటరీ గ్లోబల్ గ్రాంట్ నుంచి మంజూరైన కోటి 13 లక్ష రూపాయల వ్యయంతో వివిధ వైద్య ఉపకరణాలను గంభీరం లో ఉన్న ఏజ్ కేర్ ఫౌండేషన్ కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఆదివారం గంభీరంలో ఏజ్ కేర్ ఫౌండేషన్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అంతర్జాతీయంగా రోటరీ సేవలు ఆదర్శనీయం అని అన్నారు. వివిధ అనారోగ్యాల కారణంగా మంచాన పడిన వారికి స్వస్థత చేకూర్చే పాలటివ్ కేర్, జై గోమేట్రిక్ విభాగాలు కలిగిన ఆసుపత్రిగా ఏజ్ కేర్ ఫౌండేషన్ దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. రోటరీ గ్లోబల్ నిధుల తో సమకూర్చిన ఫిజియోథెరపీ, డయాగ్నోస్టిక్, నర్సింగ్ కాల్ విభాగాలకు చెందిన వైద్య పరికరాలతో పాటు కమర్షియల్ వాషింగ్, వంటశాల పరికరాలను ఏజ్ కేర్ ఫౌండేషన్ కు అందజేశారు.
పూర్వపు డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్. కిషోర్ కుమార్ చొరవతో వివిధ దేశాల రోటరీ క్లబ్లు, రోటరీ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నిధులను సమకూర్చినట్లు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ప్రెసిడెంట్ చింతా నేతాజీ
తెలిపారు. డాక్టర్ వి.కె. రాజు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు అజీజ్ మెమోన్, వి.జె. పటేల్, ఈ గ్లోబల్ గ్రాంట్ మంజూరుకు సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జి. సాంబశివరావు, ప్రత్యేక అతిథిగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి, ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎన్.ఎస్. రాజు, ప్రాజెక్ట్ కాంటాక్ట్ పెర్సన్ జీ.కే. మూర్తి, రోటరీ ప్రతినిధులు జి.ఎస్. రాజు, కంటిపూడి వెంకటేశ్వరరావు, సత్య శ్రీ, వర్మ, గిరి, కాళీప్రసాద్, సెక్రటరీ భాస్కర్ జగన్, డాక్టర్ టీ.వీ.ఎస్. రావు, కె ఎం కె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
