మెగా రక్తదాన శిబిరం నిర్వహణ ,రిపబ్లిక్ డే సందర్భంగా తాసుబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, వనవాసి కల్యాణ్ ఆశ్రమ్ సహకారంతో, శ్రీ సిద్ధ క్రాంతి కుమార్ మరియు రంజన్ కుమార్ పాఢీ , జేకే పేపర్ మిల్ మద్దతుతో, ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా జయకేపూర్‌లోని మనోరంజన్ కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సిద్ధ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రిపబ్లిక్ డే వంటి పవిత్రమైన రోజున రక్తదాన శిబిరం నిర్వహించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.
ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని, మొత్తం 40 యూనిట్ల రక్తం సేకరించబడిందని తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఒడిశా బ్లడ్ సెంటర్‌కు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తాసుబెల్లి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శంకర్ నాయుడు మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో రక్తదానం ఒక సంప్రదాయంగా మారాలని అన్నారు. ఒక యూనిట్ రక్తాన్ని మూడు భాగాలుగా విడగొట్టి మూడు ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు. రక్తదాతలే నిజమైన వీరులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సౌబిండి వెంకటలక్ష్మి, రంజన్ కుమార్ పాఢీ, గౌరీ శంకర్ పట్నాయక్, ఎ.కె. స్వైన్, బల్వీర్ కుమార్ మిశ్రా, ఎస్.కె. ధలా, లోకేశ్వరి, గుడ్లా నెహురు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
