Thursday, May 7, 2026
HomePoliticsAndhra Pradeshతిరుమల లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు దుష్ప్రచారాలకు నిరసనగా పరిహార పూజలు

తిరుమల లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు దుష్ప్రచారాలకు నిరసనగా పరిహార పూజలు

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవలేశ్వరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలకు నిరసనగా ప్రత్యేక పరిహార పూజలు నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పవిత్ర ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటూ భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని నేతలు ఆరోపించారు. ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్యలు మహాపాతకమని, ఈ కుట్ర పూర్తిగా బద్దలై నిజం గెలిచిందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి కష్టం నష్టం కలగకుండా పాప పరిహారణ పూజలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరిజాల బాబు, నక్కా నగేష్, పార్టీ నాయకులు మింది నాగేంద్ర, అంగాడ సత్యప్రియ, దేవులపల్లి సరిత, రుక్యా సయ్యద్, పసుపులేటి దేవి, కనకమహాలక్ష్మి దేవమాత, సాధనాల శివ, గోలి దేవా, ఎన్‌వీ శేఖర్, ఆచంట కళ్యాణ్, బొప్పన సుబ్బారావు, రాజమౌళి, సత్యం రమణ, గూటం రాజు, దాసరి ధర్మ, బర్రి కామేష్, పెనుమాక సునీల్, కొల్లి వెంకటరత్నం, మీగడ గంగాధర్, ముద్దాల అను, వై.ఎస్. కుమార్, కోటిపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments