భీమిలి గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతరకు సంబందించిన కరపత్రాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం ఆలయప్రాంగణంలో విడుదల చేసారు. ఉత్సవ కమిటీ సభ్యులు అయిన గంటా నూకరాజు, మారోజు సత్య ప్రసాద్, శిల్లా కరుణాకర్ రెడ్డి, గాడు యశ్వంత్, ఉసిరికల బంగార్రాజు మరియు ఆలయ పూజారి చౌదరి సత్యారాజు, స్థానిక గ్రామపెద్దలు, అమ్మవారి భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మార్చి 17 నుండి మార్చి 20 వరకు నాలుగు రోజులపాటు శ్రీ నూకాలమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతాయని అన్నారు. అదేవిదంగా మార్చి 4వ తేది బుధవారం రాత్రి 12 గంటల సమయంలో అమ్మవారి చాటింపు మహోత్సవం జరుగుతుందని అన్నారు. భీమిలి ఉత్సవాలు అంటేనే క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనుటకు వస్తారని అన్నారు.
