Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshచెరువుపల్లెలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు.

చెరువుపల్లెలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు.

బనగానపల్లె మండలం, చెరువు పల్లె గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు ధర్మ ప్రచారకులు బి. జయదేవానంద స్వామి శ్రీమద్రామాయణం పై ప్రవచించారు. సత్సంగాల ద్వారానే మనిషిలో పరివర్తన వస్తుందని నిరంతరం ధార్మిక చింతనతో జీవించాలని సూచించారు. తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం స్థానిక భజన మండలి భజన కార్యక్రమాలు, శ్రీమద్రామాయణ, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రామిరెడ్డి, చిన్నఆదిరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీ మద్దిలేటి, పెద్ద మోహన్ రెడ్డి, చిన్న పుల్లారెడ్డి, నాగేశ్, ప్రసాద్, మద్దిలేటి, శేఖర్, పెద్ద తిమ్మయ్య, మిద్దె భూపాల్, భజన మండలి సభ్యులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments