Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshసీతారామాలయ నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం

సీతారామాలయ నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం

వడ్డాది కొత్తూరు సింహబలుడు కొండపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పద్మనాభ సీతారామాలయం నిర్మాణానికి దాతలు విరాళాలు అందిస్తున్నారు.తాజాగా విశాఖ నగరానికి చెందిన లోటస్ స్వీట్ ఇంజనీరింగ్ వ్యాపారవేత్త నవీన్ దంపతులు రూ.రెండు లక్షలు విరాళం అందించారు.ఈ రూ.రెండు లక్షలతో ఆలయంపై దశావతారాల విగ్రహాల ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.వడ్డాది గ్రామానికి చెందిన ఎస్వీఎల్ ఎలివేటర్స్ లిఫ్ట్ అదినేత నాలం వరహాలు బాబు విజ్ఞప్తి మేరకు నవీన్ స్పందించి రూ.2 లక్షల విరాళం అందించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నవీన్ ని శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఫిబ్రవరి 26,27,28 తేదీలలో వడ్డాది కొత్తూరు లో విగ్రహ ప్రతిష్ట చేసి పద్మనాభ సీతారామ స్వామి ఆలయాన్ని ప్రారంభించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments